జై అంబెద్కర్    Read More ........


అంబెద్కరా ఆజ్ఞానంపై    నీ పోరాటం 
నీ అడుగు జాడల్లోనే నడవాలని మా ఆరాటం 
నీదో కులం మానవకులం 
నీదో మతం మానవ  మతం 
నీదో ధర్మం మనో ధర్మం 
 నీవు నమ్మిన సిధాంతం  విజ్ఞానం 
ఇంకెన్నేళ్ళు మూతికి ముంతల  భానిసత్వం 
ఇంకెన్నాళ్లు నడుముకు తాటాకుల తతంగం 
నెర్ర భారిన నెలకు నీరెంత  ముఖ్యమో 
అనగారిన నిమ్న కులాలకు  చదువంత ముఖ్యమని 
 భారిస్థారు  చదివి భారత భారత రాజ్యాంగాన్ని రాసిన  భరత జాతి ముద్దు బిడ్డ 
జయహా  జోహార్ అంబెద్కరా ........ .... 


             గుడివెలివేసింది, బడివెలివేసింది. అయినా  వెనకడుగు వెయ్యక

బడి కిటికీలోంచి పాటల్ని బ్రతుకు పోరులో గుణపాటల్ని నేర్చుకున్నావు. 

కత్తి పడితేనే వీరుడన్నారు కానీ !     పుస్తకం పట్టి వీరుడవయ్యావు. 

మైకుపడితేనే మహానుభావుడన్నారు కానీ !   కలం పట్టి మహానుభావుడవయ్యావు. 

నిన్ను బడికి రానియ్యని ఈ సమాజాన్ని భారత రాజ్యాంగం రాయమని కోరేలా చేసావ్ 

నిన్ను నిమ్న కులస్థుడు  అన్నఈ  సమాజాన్ని నిండు జ్ఞాన సంపన్నుడు అనేలా చేసావ్ 

నీవు  నడిచిన దారుల్లో మమల్ని నడవమని కొరలేదు 
నేను  పడ్డ కష్టం  పడకూడదని కోరుకున్నావ్ 
బడి కిటికీలో నీవు పడ్డ కష్టం నీకు బడిలో గుడి కట్టేలా చేసింది, మరో తల్లి ఒడిలో ఉగ్గుపాలతో పాటు  ఉన్నత చదువులు చదువులు చదివిన నీ చరిత్ర చెప్పేలా చేసింది 
నువ్వొక సైన్యం  నీ ఆయుధం చదువు 
నీ  విజయం ప్రపంచం తలెత్తి చూసే భారత రాజ్యాంగం 
jayaho అంబెద్కరా  
జయ jayaho అంబెద్కరా   ..... 

                                                                                            Read More ........
Read More.......