నాస్తికం ఎక్కడ ఉంటుందో వాస్తవం అక్కడ ఉంటుంది . నువ్వు నమ్మిన నమ్మక పోయిన  వాస్తవం ఎక్కడుంటుందో నాస్తికం అక్కడ ఉంటుంది . 
నువ్వు నడిచే నడకల్లో  నాస్తికముంటుంది. ఎందుకంటే  అది వాస్తవం, నువ్వు పీల్చే  ఊపిరిలో  నాస్తికముంటుంది ఎందుకంటె అది వాస్తవం
ఏ  జీవి అయినా ప్రకృతి కాల గర్భంలోంచి పుట్టవలసిందే . కాలం గడుస్తున్న  కొద్దీ ప్రకృతి  పరిణామ క్రమంలో వృద్ధిచెందింది ఈ జీవజాలం .

 మనం ఎంత ఆజ్ఞానంలో  బ్రతుకుతున్నామంటే 
  • కారణం లేకుండా కొడుకు తల నరికినవాడు దేవుడు 
  • ఒక నిండు సభలో ఒక స్త్రీ చీర గాలికి ఎగిరితే ఆ స్త్రీ ఉరుముల్లాన్ని  చూసి కామించినవాడు దేవుడు 
  • తన సొంత కూతురిని కామించినవాడు దేవుడు 
  • తన సొంత భార్య అయినా నిండు గర్భిణీ ని  అడువులోకి పంపినవాడు దేవుడు 
  • సొంత అన్నను చంపించినవాడు దేవుడు 
  • సొంత తల్లిని చిత్ర హింసలు పెట్టినవాడు దేవుడు 
  • దర్మం తప్పి అసత్యమాడి యుద్ధం చేసినవాడు దేవుడు ఇదేంటని ప్రశ్నిస్తే లోక కళ్యాణమంట .....
 ఆ పూర్వపు రోజుల్లో  సామాన్యులనే నిజ మానవులు కూడా ఇలాంటి వికృత చేష్టలు చేసినట్లు చరిత్ర లేదు అలాంటప్పుడు వీళ్ళు దేవుళ్ళ ఎలా అవుతారు ? 
అయితే కామికులు , మూర్ఖులవుతారు గాని 
ఏది ఎమైనా  వాస్తవాన్ని వెలికితీసి విజ్ఞానుల్ని చేయడమే  ఈ మన నాస్తిక సమాజ లక్ష్యం 
దైవం మతం కులం అని జనం నర  నరాల్లో జీర్ణయంచుకుపోయిన మూఢనమ్మకాల్ని పారద్రోలి జ్ఞాన జ్యోతిని వెలిగించడమే మన లక్ష్యం 
మనదో కులం అది మానవకులం 
మనదో మతం అది మానవ మతం 
మనదో ధర్మం అది  వాస్తవ ధర్మం 
మనదో సిద్దాంతం అది నాస్తికం 

నాడు బలహీనుడు అజ్ఞానుడైతే  
బలవంతుడు భగవంతుడైనాడు 
కులం పేరుచెప్పి కుభేరులైనారు \
మతం పేరు చెప్పి మేధావులైనారు . 
జాతకం అనే భూటకలతో ఎడ్డీ మనుషుల జూసి జనాల్ని ఎర్రి గొర్రెల్ని జేసినారు 
పంచాంగాలని ప్రజలకు పంచె తప్ప అంగీ కూడా లేకుండా జేసినారు 
పూజలని పుట్లు పుట్లు ధాన్యాల్ని గుంజినారు 
ఇంకెన్నాళ్లు ఈ అజ్ఞానపు ఆచారాలు 
నాటి చరిత్రలో జ్ఞానమున్నాడే  గద్దెనెక్కినాడు 
అజ్ఞానమున్నోడు అణిగి మణిగి బ్రతికానాడు 
వాస్తవ జ్ఞానాన్ని పొందితే విజ్ఞానుడవవుతావు అజ్ఞానుడవై అణిగి మణిగి అసంభవ ఆచారాలతో  బ్రతుకుతావో వాస్తవాన్ని తెలుసుకొని ప్రగతి పదంలో నడుస్తావో  నీ ఇష్టం
            BUT  
వాస్తవ జ్ఞానాన్ని పొందాలంటే మన నాస్తిక సమాజముంది నీ కోసం నీ అనుచరులకోసం  ఎల్లప్పుడు తలుపు తెరిచే ఉంటుంది ఎందుకంటె జ్ఞానానికి అజ్ఞానికి మధ్యలున్నవారిని, 
ప్రతి ఒక్కరిని జాగృత పరిచి  విజ్ఞానుల్ని చేసి చేయి చేయి కలుపుతూ చేయూత నందిస్తూ ముందుకెళ్లడమే మన లక్ష్యం 
              
                 జై INSON    Read More