రైతు గోస
నీడ నిచ్చే చెట్టు నీడకై చూసినట్టు అన్నం పెట్టె రైతు అరచేతి చాచి అయ్యా ఇంత అన్నం పెట్టండయ్యా అని అన్నంకై చూడ వట్టే
రెక్కల్ని ముక్కల్ని జేసి బొక్కలు బొరుసులు దేలిన చెమట చుక్కల మడి మలిపి పంట పండించిన ఎంత గింజు కున్న గిట్టు బాటు ధర లేదాయె నా రథనాల భరత భూమిలో
బుక్కెడు మెతుకులు లేని బ్రతుకులు బ్రతకలేక తన బిడ్డలకోసం కన్నీళ్లు తడసిన మెతుకులు రైతు తింటుంటే ఆ కన్నీళ్లు తడసిన మెతుకులు ఇలా అంటున్నాయి , కండలు కరిగించే రైతు కష్టానికి ఉరకలు వేస్తున్న ఉడుకు రక్తం తోడైతే రైతే రాజవుతాడని మెతుకులేని బ్రతుకులకు కడుపు నింపే మెతుకవుతాడని .,
రైతు నవ్వుని చూడాలని పండుటాకులు రాలి చిగురించిన రైతు నవ్వడాయే
ఈ పండుటాకులు ఎన్ని సార్లు ఎండి చిగురించిన రైతు నవ్వాడాయే
నన్ను మించిన వెలుగు రైతు నవ్వులో ఉందని సూర్యుడు ప్రతి రోజు ఉదయించి చుసిన రైతు నవ్వడాయే
రైతు నవ్వాలంటేకావాలి ఒక మంత్రం
ఆ మంత్రమే యువ తంత్రం దాంతో సాధించేద్దాం రైతు స్వాత్యంత్రం
మిత్రమా !
నాడు స్వాత్యంత్రం కోసం పోరాడం సాధించాం
నిన్న తెలంగాణ కోసం పోరాడం సాధించాం
నేడు రైతు కోసం పోరాడదాం సాదించలేమా
సాధిస్తామని సాధించగలమని నమ్మకం నాకుంది నీ కుందా ? .......
లేవండోయ్ యువకుల్లారా నేను సైతమంటూ రారండోయ్ కలిసి కట్టుగా మార్చేద్దాం రైతు రాతని సృష్టిద్దాం రైతు రాజ్యాన్ని.
వీలుంటే SHARE చెయ్


1 Comments